పంటలకు గడ్డి మందు స్ప్రే చేసినది తెలియక మేత మేసిన 15 మేకలు శుక్రవారం మృతి చెందాయి. ఈ విషాదకర ఘటన పెద్ద సముద్రం మండలం, బూసిపల్లి సమీపంలోని కర్ణాటక బార్డర్లో జరిగింది. బాధితుడి కథనం మేరకు. బూసిపల్లికి చెందిన నిరుపేద సుబ్రహ్మణ్యం 15 మేకలు మేపుకొని వాటితో వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తుండగా విష ప్రయోగానికి మేకలు చనిపోవడంతో 3లక్షల ఆస్తి నష్టం కలిగి జీవనాధారాన్ని కోల్పోయానని కన్నీటి పర్వతం అయ్యాడు.