మంగళవారం నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లి గ్రామం, పిట్టావాండ్లపల్లె వద్ద పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై తిప్పేస్వామి నేతృత్వంలో సిబ్బంది దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మూడు మొబైల్ ఫోన్లు, రూ. 3,750 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఏపీ గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.