మదనపల్లి నియోజకవర్గంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు శంకర్ కుటుంబానికి పార్టీ తరఫున రూ.5 లక్షల భీమా బుధవారం అందజేయబడింది. పార్టీ సీనియర్ నాయకులు ఆర్జే వెంకటేష్, మృతుని భార్య సుమతికి ఈ భీమా పత్రాన్ని అందజేశారు. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.