రోడ్డు దిగ్బంధనంతో మాలేపాడులో ఉద్రిక్తత

మదనపల్లె మండలంలోని మాలేపాడులో ఆదివారం ఉదయం టీడీపీకి చెందిన మధుకర్ రెడ్డి, జాఫర్ బాష వర్గాల మధ్య దారి, భూ వివాదాల కారణంగా ఘర్షణ చోటుచేసుకుంది. గతంలో పంటల విషయంలో అడ్డుపడటం, ప్రస్తుతం రహదారిని మూసివేయడం వంటి కారణాలతో ఇరువర్గాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్