మదనపల్లె ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం

మంగళవారం మదనపల్లెలో కుటుంబ సమస్యల కారణంగా ఆర్. రమేష్ (22) అనే యువకుడు ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి అతన్ని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నాడు. వన్ టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్