కూటమి పాలనపై వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ: నిస్సార్

మదనపల్లెలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ జరిగింది. మిషన్ కాంపౌండ్ నుంచి చిత్తూరు బస్టాండు సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ, సూపర్ సిక్స్ హామీలు అమలు కాలేదని, భూ కబ్జాలు, కల్తీ మద్యం, రైతుల సమస్యలు పెరిగాయని ఆరోపించారు. 17 మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేశారని, ప్రజా సమస్యలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్