దగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నిరసన

అన్నమయ్య జిల్లా మదనపల్లె అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం "దగా డీఎస్సీ"కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర చక్రధర్ డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. జిల్లా అధ్యక్షులు జంగం రెడ్డి కిషోర్ దాస్ నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కళ్యాణ్ భరత్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశోక్ రాయల్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్