మైదుకూరు మండలం జీవీసత్రం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరు వాకింగ్ చేస్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ప్రమాద దృశ్యాలను పరిశీలిస్తూ, వాహనాన్ని గుర్తించే చర్యలను ముమ్మరం చేశారు.