రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏ. వి. రమణ, ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన పాటించని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం మైదుకూరులో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. రెవెన్యూ, గ్రామ సచివాలయాలు, ఆసుపత్రుల్లో అధికారులు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంది ఎల్లయ్య, రామ్మోహన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.