మైదుకూరు లాడ్జిలో దారుణం.. వ్యాపారి దారుణ హత్య

మైదుకూరు కడప రోడ్డులోని ఒక లాడ్జిలో తాడిపత్రికి చెందిన స్క్రాప్ వ్యాపారి వివేకానంద హత్యకు గురయ్యాడు. ఆర్థిక విభేదాలే ఈ ఘాతుకానికి కారణమని తెలుస్తోంది. సరుకు డబ్బులు ఇవ్వలేదని మాట్లాడేందుకు పిలిపించిన వ్యాపారి సూరిబాబు, మరో ఇద్దరు కలిసి వివేకానందను తీవ్రంగా కొట్టి చంపినట్లు సమాచారం. అర్బన్ సీఐ రమణారెడ్డి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్