చాపాడు: పాఠశాల వద్ద మద్యం షాపు

చాపాడు మండల పరిధిలోని అన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో నూతనంగా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడం తగదని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను కలిసి మద్యం దుకాణాన్ని తొలగించాలని కోరారు. ఎమ్మెల్యే స్పందించి అధికారులతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్