చాపాడులో మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరిగింది. ప్రధానోపాధ్యాయులు తల్లికి వందనం, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమం గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేశారు. సమావేశం అనంతరం ఆట పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ అలీ, తెలుగుదేశం పార్టీ మైనార్టీ కార్యదర్శి అక్బర్ సలీం, సుబ్రహ్మణ్యం, ప్రధానోపాధ్యాయులు శాస్త్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.