మైదుకూరు డీఎస్పీ పర్యవేక్షణలో మంగళవారం ఉదయం పోలీసులు పట్టణంలోని పలు కాలనీల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులు, గంజాయి స్మగ్లర్ల ఇళ్లలో తనిఖీలు చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. సరైన పత్రాలు లేని 21 బైక్‌లు, 6 ఆటోలను సీజ్ చేశారు. నేరాల నివారణకు, అసాంఘిక శక్తుల కట్టడికి ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.