బ్రహ్మంగారిమఠం మండలంలో యూరియాను అధిక ధరలకు అమ్ముతున్న ఎరువుల దుకాణాలపై చర్యలు తీసుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి ప్రభాకర్ బుధవారం డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఎరువుల దుకాణాల యజమానులు బస్తా 500 రూపాయలకు పైగా అమ్ముతున్నారని ఆరోపించారు. అధిక ధరలకు అమ్ముతున్న దుకాణాలను సీజ్ చేసి, యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు.