చాపాడు మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం మండల రెవెన్యూ అధికారి రామాకుమారి ఆధ్వర్యంలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం రైతులకు కొత్త పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తోందని, రైతులందరూ వీటిని తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్బర్ సలీమ్, అక్బర్ వలి, బైపిరెడ్డి, కిరణ్, మస్తాన్, రవి, సుబ్బారాయుడు, అబ్దుల్, రీసర్వే డిటి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి, విఆరో ఇస్మాయిల్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.