కడప కర్నూలు జాతీయ రహదారి దువ్వూరు సమీపంలో టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనదారులకు గాయాలయ్యాయి. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజుపాలెం మండలం వేలువలి గ్రామానికి చెందిన బాల నాగయ్య, హుస్సేన్ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్సు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.