ఖజీపేట మండలం నందిపాడులో నిన్న కురిసిన భారీ వర్షానికి రెండు నెలల క్రితం వేసిన ఆర్డీఎస్ విద్యుత్ లైన్ పూర్తిగా నేలకొరిగింది. స్థానికుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ, సాయంత్రంలోపు లైన్ పడిపోయే ప్రమాదం ఉందని, ఇది జరిగితే గ్రామం చీకట్లోకి వెళ్తుందని, మరమ్మతులకు నాలుగు రోజులు పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి పెను ప్రమాదాన్ని నివారించాలని ఆయన కోరారు.