మైదుకూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరికి తీవ్ర గాయాలు

మైదుకూరులోని ప్రొద్దుటూరు రోడ్డులో బైపాస్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకులను బస్సు ఢీ కొట్టడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్