మైదుకూరులో స్మశానాలకు మహర్దశ: ఎమ్మెల్యే పుట్టా

మైదుకూరు నియోజకవర్గంలో స్మశాన వాటికల అభివృద్ధికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మంగళవారం శ్రీకారం చుట్టారు. రూ. 20 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన దయానఖాన్ పల్లె స్మశాన వాటికను ఆయన ప్రారంభించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నియోజకవర్గంలో 61 స్మశానాలను రాష్ట్రంలోనే తొలిసారిగా అభివృద్ధి చేస్తున్నామని, మార్చిలోపు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మొత్తం 600 స్మశానాలను బాగుచేయడమే లక్ష్యమని, అంత్యక్రియలు ప్రశాంతంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్