ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ ఈనెల రెండవ తేదీ మంగళవారం కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఎస్ టి యు రాష్ట్ర కౌన్సిలర్ కుసేటి పాలకొండయ్య, కార్యదర్శి గోసెట్టి రామ్మోహన్ పిలుపునిచ్చారు. శుక్రవారం మైదుకూరు ఎంఆర్సి ఆవరణంలో నిర్వహించిన ఎస్టీయూ మండల సమావేశంలో వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న మూడు డి. ఏలను ప్రకటించాలన్నారు.