కడప రైతు సేవా సమితి సభ్యత్వ నమోదు ప్రారంభం

మైదుకూరులో కడప జిల్లా రైతు సేవా సమితి 2026 సభ్యత్వ నమోదును జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ ప్రారంభించారు. పట్టణ అధ్యక్షుడు రామ్మోహన్ నుంచి తొలి సభ్యత్వం స్వీకరించారు. రాజకీయాలకు అతీతంగా రైతుల పక్షాన పోరాడుతున్న ఈ సమితిని బలోపేతం చేసేందుకు రైతులంతా సభ్యత్వం తీసుకోవాలని రమణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాశరెడ్డిగారి సుబ్బరాయుడు, షామీర్ భాష, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్