మిట్టమనుపల్లెలో పిడుగుపాటు.. సకాలంలో స్పందించిన అధికారులు

మైదుకూరు మండలం మిట్టమనుపల్లె ఎస్సీ కాలనీలో పిడుగుపాటుతో ఒక పాక ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఇస్మాయిల్ అనే గ్రామస్థుడికి చెందిన ఈ పాక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పిడుగుపాటుతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే రెవెన్యూ, ఫైర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకుని అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్