రైతు సేవాసమితి అధ్యక్షుడు ఏవీ రమణ మైదుకూరులో కార్మిక సంస్మరణ దినోత్సవం సందర్భంగా వృత్తి కార్మికులతో మాట్లాడుతూ, శ్రామిక కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్మికులకు ప్రమాదం జరిగితే ప్రభుత్వ లబ్ధి పొందడానికి గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఉద్యోగుల వలె సంఘాలుగా ఏర్పడి హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ పాల్గొన్నారు.