ఏఐటీయూసి విద్యుత్ అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మైదుకూరు బ్రహ్మంగారిమఠం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన తెలిపారు. జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ, తెలంగాణలో జరిగినట్లే ఏపీ విద్యుత్ కార్మికుల్ని సంస్థల్లో విలీనం చేయాలని, పెండింగ్‌లో ఉన్న పిఆర్సీ అరియర్స్ చెల్లించాలని కోరారు.