మైదుకూరు: ఈనెల 16న చాపాడు మండల ఉప ఎంపీపీ ఎన్నిక

చాపాడు మండల పరిషత్ ఉపాధ్యక్షుడి ఎన్నికను ఈనెల 16న నిర్వహించనున్నట్లు శుక్రవారం ఎంపీడీవో వీర కిషోర్ తెలిపారు. పల్లవోలు ఎంపీటీసీ, 2 ఉప మండల అధ్యక్షురాలిగా ఉన్న నగర్తి సుందరమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ ఈనెల 16న నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 16న రెండు ఉప మండల అధ్యక్ష స్థానానికి ఎంపీటీసీని ఎన్నుకోనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.

సంబంధిత పోస్ట్