మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లెలో హైవే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో త్రాగునీరు కలుషితం అవుతున్నదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైవే పనులు చేసే కాంట్రాక్టర్ తాగునీరు పైపులను పగలగొట్టడంతో సమస్య నెలకొన్నది. త్రాగునీటి పైపులలో మురికి నీరు కలుషితమై అనారోగ్యం పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి త్రాగునీటి పైపులను మరమ్మత్తులు చేయవలసిందిగా కోరుచున్నారు.