మాజీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డిపై ఎమ్మెల్యే పుట్టా నిప్పులు

మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డిపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేశారని, తన హయాంలో ఆరుగురికి ఉచితంగా ఉద్యోగాలు ఇప్పించానని తెలిపారు. రఘురాంరెడ్డి రూ. 92 కోట్లు దోచుకున్నారని, భూకబ్జాలు, కమీషన్ల కోసమే పనిచేశారని ఆరోపించారు. తాను ప్రజల మనిషినని, అభివృద్ధి కోసమే తపిస్తున్నానని పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్