మైదుకూరు నియోజకవర్గ రైతులకు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సూచన చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే ఓ ప్రకటనలో మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని, యూరియా కొరత లేదన్నారు. రైతులు సంబంధిత రైతు సేవ కేంద్రానికి వెళ్లి పట్టాదారు పాస్ బుక్, రికార్డుల సమర్పిస్తే రైతుకు అర్హత ఉన్నంత యూరియా అధికారులు అందిస్తారన్నారు.