పోక్సో కేసులో నిందితురాలికి నాన్‌బెయిలబుల్ వారెంట్

మైదుకూరు మండలం నానుబాలపల్లెకు చెందిన మొదగాల్ల నాగమునెమ్మ (మాబుచాన్)పై పోక్సో కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2020లో నమోదైన పోక్సో కేసు విచారణకు ఆమె వరుసగా గైర్హాజరు కావడంతో, 8వ అదనపు జిల్లా జడ్జి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ వారెంట్ మేరకు నిందితురాలు ఫిబ్రవరి 3వ తేదీలోగా కోర్టులో లేదా పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని సీఐ రమణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్