కడప జిల్లా ముసనాయనపల్లిలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో రైతు వెంకటేశు పొలంలో పీఎండీఎస్ పంట కోత ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగంలో అరటి పంట ఎకరానికి సుమారు 14.33 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అరటి సాగుకు ముందు మల్చింగ్ పద్ధతి ద్వారా భూమి సారం, తేమ పెరుగుతాయని అధికారులు తెలిపారు. రైతులంతా ఈ విధానాన్ని పాటించాలని సూచించారు.