వైయస్సార్ జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, కడప నగరంలో ట్రాఫిక్ సీఐ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.