పోరుమామిళ్ల: విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్ మాస్టర్ పై పోక్సో కేసు

పోరుమామిళ్ల మండలంలోని కొండుగారిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రధానోపాధ్యాయుడు వెంకటసుబ్బారెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. బుధవారం డీఎస్పీ రాజేంద్రప్రసాద్ విచారణ చేపట్టారు. మద్యం మత్తులో బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. డీఈవో సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం డిప్యూటీ డీఈవో రాజగోపాల్రెడ్డి పాఠశాలలో విచారణ చేపట్టి, నివేదికను డీఈవోకు అందజేశారు.

సంబంధిత పోస్ట్