చాపాడు మండలం ఓబుల్ రెడ్డి పేటలో మద్యం మత్తులో భార్యను వేధిస్తున్న తండ్రిని, పదవ తరగతి చదువుతున్న కొడుకు (మైనర్) పదునైన ఆయుధంతో కొట్టి చంపిన దారుణం జరిగింది. తల్లిని రోజూ వేధిస్తుండటంతో ఆగ్రహించిన కుమారుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు విచారిస్తున్నారు.