ఖమ్మం జిల్లా ఖాజీపేట మండలం పుల్లూరులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో 41 రోజుల పాటు జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు గురువారం వైభవంగా ముగిశాయి. మహంకాళి వీర బ్రహ్మయ్యాచార్యుల ఆధ్వర్యంలో గోవింద సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, అన్నప్రసాదాలను స్వీకరించారు.