ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే నిందితుడి అరెస్ట్

ప్రతిరోజూ పాలు పోసే నెపంతో ఇంటి తాళం అపహరించి చోరీకి పాల్పడిన గోవిందును మైదుకూరు పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ నెల 6న రమణమ్మ ఇంట్లో 52 గ్రాముల బంగారం, 175 గ్రాముల వెండిని దొంగిలించినట్లు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. వీటి విలువ సుమారు ఎనిమిది లక్షలు ఉంటుందని అంచనా. కె. సి. కాలువ వద్ద సీఐ రమణారెడ్డి బృందం గోవిందును పట్టుకుని, దొంగిలించిన సొమ్మును రికవరీ చేసింది. గోవిందుపై గతంలో కూడా పలు దొంగతనం కేసులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్