అభివృద్ధిపై చర్చకు సిద్ధమా.. మాజీ ఎమ్మెల్యేకి టిడిపి నేత సవాల్

మైదుకూరు టిడిపి పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పై మాజీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ, గతంలో 4 సార్లు జరిగిన అభివృద్ధిని తమ ఎమ్మెల్యే రెండేళ్లలోనే చేసి చూపించారని తెలిపారు. పీఏల జోక్యం అవాస్తవమని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్