మైదుకూరు: తెలుగు లెక్చరర్ కు పద్మ ప్రతిభా జాతి అవార్డు

మైదుకూరు బాలశివ డిగ్రీ కళాశాలకు చెందిన తెలుగు లెక్చరర్ రవికళ్యాణ్ పద్మ ప్రతిభా జాతి అవార్డును ఆదివారం అందుకున్నారు. హైదరాబాద్ త్యాగరాజ గాన సభ కళావేదికలో కవి సమ్మేళనం జరిగింది. పుట్టినరోజు అనే అంశంపై 'నా కానుక' శీర్షికతో రవి కళ్యాణ్ ప్రతిభ చూపారు. ఆయనకు ఈ అవార్డు అందజేశారు. హిమాయత్ నగర్ సీఐ పురుషోత్తం, హైకోర్టు అడ్వకేట్ రామమూర్తి, ప్రొఫెసర్ ప్రవీణ్ దలై, తమిళ హీరో కిరణ్ కుమార్ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్