ఖాజీపేట మండల కేంద్రంలోని మహిళా మార్టు పక్కన ఉన్న వి. ఎస్ అమితాబ్ ఇంటిలో భారీ చోరీ జరిగింది. దొంగలు ఇంటి వాకిలి, తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించారు. ఇంటిలోని నాలుగు బీరువాలు పగలగొట్టి, డబ్బు, నగలు చోరీ చేశారు. శుక్రవారం స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.