మైదుకూరు-బద్వేల్ జాతీయ రహదారిపై సోమయాజుల పల్లె నుండి జీవీ సత్రంకు వెళుతున్న ఆటోను టిప్పర్ ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో సోమయాజుల పల్లెకు చెందిన సంటెయ్యకు తీవ్ర గాయాలయ్యాయి, మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను మొదట స్థానిక ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న సంటెయ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.