కడప జిల్లా మైదుకూరులో టమోటా ధరలు విపరీతంగా పడిపోయాయి. పక్క జిల్లాల్లో 30 కేజీల గంప రూ. 700-800 పలుకుతుంటే, ఇక్కడ వ్యాపారులు సిండికేట్‌గా మారి కేవలం రూ. 250-300 మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గంటకో రేటు మారుస్తూ తమను నష్టపరుస్తున్నారని, అధికారులు జోక్యం చేసుకుని ఈ సిండికేట్ దోపిడీని అరికట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.