బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని బస్వాపురం టోల్ ప్లాజా సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో స్థానికులు ఓ గుర్తుతెలియని మగ శవాన్ని కనుగొన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుమారు ఐదు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు శవాన్ని కాల్చి పడవేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శవం పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పటికీ, లంగీ ధరించిన 40-45 ఏళ్ల మగ వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.