కడప విజిలెన్స్ అధికారులు దువ్వూరు మండలం నేలటూరులోని ఓ గోదాంపై దాడులు నిర్వహించారు. రిజిస్టర్లలో నమోదు చేసిన నిల్వలకు, వాస్తవంగా ఉన్న స్టాక్‌కు మధ్య తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ నిల్వ ఉన్న వరి, కొర్ర ధాన్యం విలువ సుమారు రూ. 10.26 కోట్లుగా అంచనా వేశారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించి, ఆ ధాన్యం, కీలక దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.