'మైదుకూరులో 35 వేల పెన్షన్లు ఇస్తున్నాం'

మైదుకూరు మున్సిపాలిటీ 14వ వార్డులో పెన్షన్లు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి సవిత, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పంపిణీ చేశారు. శుక్రవారం మైదుకూరులో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇన్ ఛార్జ్ మంత్రి సవితమ్మ చేతుల మీదులుగా పెన్షన్ అందించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుతం మైదుకూరులో 35 వేల పెన్షన్లు ఇస్తున్నాం అని తెలిపారు. కొత్తగా మైదుకూరు కు 606 నూతన పెన్షన్లు మంజూరు అయ్యాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్