అన్నమయ్య జిల్లా పోలీసు విభాగంలో ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్న ఓబయ్య అకాల మరణం పట్ల జిల్లా ఎస్పీ ధీరజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శనివారం పీలేరు మండలం తలుపుల గ్రామంలో పోలీసు లాంఛనాలతో ఓబయ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా, బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా రూ. 1 లక్ష అందజేసి, శాఖాపరమైన అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. విధుల పట్ల అంకితభావం కలిగిన అధికారిని కోల్పోవడం బాధాకరమని ఎస్పీ పేర్కొన్నారు.