గుర్రంకొండ మండలం గొల్లపల్లి క్రాస్ వద్ద అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై ఆదివారం సాయంత్రం ఎస్ఐ బాలకృష్ణ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 32 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, మద్యం విక్రేతను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మండల పరిధిలో అక్రమ బెల్ట్ షాపులకు అవకాశం ఇవ్వబోమని, ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో తరచూ ప్రమేయం ఉన్న వ్యక్తులపై గ్రామ బహిష్కరణతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.