పూజారి ఎల్లయ్య దారుణ హత్య: నవ్వుకుంటూ పారిపోయిన నిందితులు

మండలంలోని తీతకుంటపల్లిలో పూజారి ఎల్లయ్య (36) దారుణ హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దాడి అనంతరం నిందితులు ద్విచక్ర వాహనంపై నవ్వుకుంటూ పారిపోయారని గ్రామస్థులు తెలిపారు. మృతుని తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత పోస్ట్