అన్నమయ్య జిల్లాలో టోల్ గేట్ సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయల్పాడు మండలం గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు దాడి చేసిన దృశ్యాలు వైరల్ అయిన నేపథ్యంలో, సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నాడు, దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించిన ఆయన, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.