గుర్రంకొండలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

గుర్రంకొండ మండలం సంగసముద్రం పంచాయతీలో శుక్రవారం మీభూమి –మీహక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని, పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు చట్టబద్ధమైన భరోసా కల్పిస్తాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్