కలికిరి: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

గురువారం సాయంత్రం కలికిరి మండలం నగిరిపల్లి సమీపంలో దిగువ హరిజనవాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతికి చెందిన హరికృష్ణ, భార్య అరుణ కుమారితో కలిసి సీటీఎంలో జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారి బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అరుణ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త హరికృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్