అన్నమయ్య జిల్లా కలకడ మండలంలోని ఓ ఉమ్మడి కుటుంబంలోని 12 మంది విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు పడినట్లు శనివారం సాయంత్రం ముగ్గురు తల్లులకు చెందిన 12 మంది పిల్లలకు డబ్బులు జమ అయినట్లు తెలిపారు. ఒకే సారి రూ. 1. 56 లక్షలు వారి అకౌంట్లో పడటంతో ఆ కుటుంబం, ఆ తల్లుల సంతోషానికి అవధులు లేవు. అలాగే మరొకరికి అన్నమయ్య జిల్లాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి తల్లికి వందనం డబ్బులును వేసినట్లు తెలిపారు.